వంద మంది సీఎంలు వచ్చినా ఈటల గెలుపును ఆపలేరు: బీజేపీ నేత రఘునందన్ రావు
- హుజూరాబాద్ లో ఈటలదే గెలుపు
- నోట్లు వెదజల్లినా ప్రజలు ఈటలకే పట్టం కడతారు
- ఇన్నేళ్లలో టీఆర్ఎస్ ఒక బీసీ నేతను కూడా తయారు చేసుకోలేకపోయింది
దుబ్బాక ఎన్నికలో గెలుపు కోసం బీజేపీ ఎంత కష్టపడి పని చేసిందో... హుజూరాబాద్ లో కూడా అదే విధంగా పని చేస్తామని రఘునందన్ రావు అన్నారు. 14 ఏళ్ల ఉద్యమ పార్టీ, ఏడేళ్ల అధికార పార్టీ అయిన టీఆర్ఎస్ ఇన్నేళ్లలో ఒక్క బలమైన బీసీ నేతను కూడా తయారు చేసుకోలేకపోయిందని ఎద్దేవా చేశారు. ఊరంతా ఫ్లెక్సీలు పెట్టుకున్నంత మాత్రాన గెలుపు రాదని చెప్పారు. హుజూరాబాద్ లో బీజేపీ, టీఆర్ఎస్ మధ్యే పోటీ ఉంటుందని చెప్పారు.