Venkatesh Daggubati: 'దృశ్యం 2' డీల్ కూడా కుదిరిందట!

Drushyam deal confirmed Hotstar
షార్ట్స్‌లో చూడండి
వెంకటేశ్ కథానాయకుడిగా చిత్రీకరణ పూర్తిచేసుకున్న రెండు సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఒకటి 'నారప్ప' అయితే, మరొకటి 'దృశ్యం 2'. తమిళ సినిమా 'అసురన్'కి రీమేక్ గా 'నారప్ప' రూపొందింది. తక్కువ బడ్జెట్లో .. తక్కువ సమయంలో ఈ సినిమాను పూర్తి చేశారు. ఖర్చుతో పెద్దగా అవసరం లేని కథాబలం కలిగిన సినిమా ఇది. అందువల్లనే ధనుశ్ హీరోగా చేసిన ఈ సినిమా తమిళంలో భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. అలాంటి ఈ కంటెంట్ ను 'అమెజాన్ ప్రైమ్' లో విడుదల చేయడానికి రంగం సిద్ధమైంది.

ఈ నేపథ్యంలో 'దృశ్యం 2' సినిమాను కూడా ఓటీటీలోనే విడుదల చేయనున్నారనే టాక్ వచ్చింది. ఈ సినిమాను కూడా అమెజాన్ ప్రైమ్ వారికే ఇవ్వనున్నట్టుగా వార్తలు వచ్చాయి. ఆ తరువాత డిస్నీ హాట్ స్టార్ వారితో చర్చలు జరుగుతున్నట్టుగా చెప్పుకున్నారు. వాళ్లతోనే డీల్ కుదిరిందనేది తాజా సమాచారం. అయితే ఈ విషయమై అధికారిక ప్రకటన రావలసి ఉంది. మలయాళ 'దృశ్యం 2' కూడా డిజిటల్ ఫ్లాట్ ఫామ్ పైనే విడుదలై అనూహ్యమైన విజయాన్ని అందుకుంది. కథాబలం కలిగిన ఈ సినిమాకి తెలుగులోను విశేషమైన ఆదరణ లభించడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
Go Back to Shorts
Venkatesh Daggubati
Meena
Drushyam 2

More Telugu News