KTR: కేసీఆర్ నాయకత్వంలో ఏపీతోనే కాదు, అవసరమైతే దేవుడితో కూడా కొట్లాడుతాం: కేటీఆర్

KTR comments on Krishna river water issue
షార్ట్స్‌లో చూడండి
తెలంగాణ మంత్రి కేటీఆర్ ఇవాళ నారాయణపేట జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన కృష్ణా నదీ జలాల వివాదంపై స్పందించారు. కృష్ణా నదీ జలాల విషయంలో తాము ఎవరితోనూ రాజీపడబోమని స్పష్టం చేశారు. చట్ట ప్రకారం తమకు రావాల్సిన నీటి కేటాయింపుల కోసం పోరాడుతామని స్పష్టం చేశారు. కేసీఆర్ నాయకత్వంలో ఏపీతోనే కాదు, అవసరమైతే దేవుడితో కూడా కొట్లాడుతామని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రయోజనాలే తమకు పరమావధి అన్నారు.

కేటీఆర్ నేడు నారాయణపేటలో ఇంటిగ్రేటెడ్ హ్యాండ్లూమ్ ట్రైనింగ్, టెక్స్ టైల్ పార్కుకు శంకుస్థాపన చేశారు. ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి కోరిన మీదట, రూ.10 కోట్లతో స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్ కు శ్రీకారం చుడుతున్నట్టు కేటీఆర్ వెల్లడించారు.
Go Back to Shorts
KTR
Krishna River Water
KCR
Andhra Pradesh
Telangana

More Telugu News