సస్పెన్షన్ కు గురైన ఐపీఎస్ అధికారి జీపీ సింగ్ పై దేశద్రోహం కేసు
- అక్రమాస్తుల కేసులో గత వారమే సస్పెండ్ అయిన సింగ్
- ఇంట్లో సోదాల సందర్భంగా కీలక పత్రాల స్వాధీనం
- దేశద్రోహం కేసు నమోదు చేసిన చత్తీస్ గఢ్ పోలీసులు
జీపీ సింగ్ కు చెందిన 15 చోట్ల ఏసీబీ, ఈఓడబ్ల్యూలు సోదాలు నిర్వహించాయి. ఈ సోదాల్లో ఆయన వద్ద దాదాపు రూ. 10 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్టు అధికారులు గుర్తించారు. గతంలో ఏసీబీ అడిషనల్ డైరెక్టర్ గా కూడా సింగ్ పని చేశారు. మరోవైపు సీఎం భూపేశ్ బాగెల్ మాట్లాడుతూ, పోలీసులు స్వాధీనం చేసుకున్న పత్రాల ఆధారంగా జీపీ సింగ్ పై చర్యలు తీసుకున్నామని చెప్పారు. ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు కుట్ర పన్నిట్టు ఆ పత్రాలు సూచిస్తున్నాయని తెలిపారు. మరవైపు దేశద్రోహం కేసును సవాల్ చేస్తూ హైకోర్టును సింగ్ ఆశ్రయించారు. ఈ ఘటనపై సీబీఐ వంటి సంస్థల చేత దర్యాప్తు చేయించాలని కోర్టును కోరారు.