తెలంగాణలో గత 24 గంటల్లో 729 మందికి కరోనా పాజిటివ్

Telangana state covid cases update
  • తాజాగా 1,06,045 కరోనా పరీక్షలు
  • జీహెచ్ఎంసీ పరిధిలో 72 కేసులు
  • ఖమ్మం జిల్లాలోనూ 72 మందికి కరోనా
  • నిర్మల్ జిల్లాలో కొత్త కేసులు నిల్
  • రాష్ట్రవ్యాప్తంగా ఆరుగురి మృతి
తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య గత కొన్ని రోజుల నుంచి నిలకడగా 1000కి లోపే నమోదవుతోంది. అలాగే, గత 24 గంటల్లో రాష్ట్రంలో 1,06,045 కరోనా పరీక్షలు నిర్వహించగా, 729 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనూ, ఖమ్మం జిల్లాలోనూ 72 చొప్పున కొత్త కేసులు నమోదయ్యాయి. నిర్మల్ జిల్లాలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు.

అదే సమయంలో 987 మంది కరోనా నుంచి కోలుకోగా, ఆరుగురు మరణించారు. తాజా మరణాలతో కలిపి రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 3,720కి చేరింది. తెలంగాణలో ఇప్పటివరకు 6,30,514 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 6,15,852 మంది కొవిడ్ నుంచి విముక్తులయ్యారు. ఇంకా 10,942 మంది చికిత్స పొందుతున్నారు.
Go Back to Shorts
Telangana
COVID19
New Cases
Bulletin
Update

More Telugu News