మహిళా సైనికుల సౌకర్యం కోసం 'హైహీల్స్' కు మార్పులు చేయనున్న ఉక్రెయిన్
- ఇటీవల మహిళా సైనికులకు హైహీల్స్
- సర్వత్రా విమర్శలు, ఆందోళనలు వ్యక్తం
- హైహీల్స్ కు మార్పులు చేశామన్న ఉక్రెయిన్
- రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటన
ఈ నేపథ్యంలో, ఉక్రెయిన్ రక్షణ మంత్రిత్వ శాఖ మరో ప్రకటన చేసింది. మహిళా సైనికులకు మరింత సౌకర్యవంతంగా ఉండేలా ప్రత్యేకంగా రూపొందించిన హైహీల్స్ అందిస్తామని తెలిపింది. హైహీల్స్ నిర్ణయాన్ని మాత్రం ఉపసంహరించుకోవడంలేదని, వాటిని మహిళా సైనికులకు అనుగుణంగా రూపొందిస్తున్నామని ఉక్రెయిన్ రక్షణ మంత్రి ఆంద్రీయ్ తరాన్ వెల్లడించారు.