తెలంగాణలో గత 24 గంటల్లో 808 కరోనా కేసులు, 7 మరణాలు

  • జీహెచ్ఎంసీ పరిధిలో 82 కేసులు
  • ఆదిలాబాద్ జిల్లాలో ఇద్దరికి కరోనా
  • 1,061 మందికి కరోనా నయం
  • ఇంకా 11,704 మందికి చికిత్స
తెలంగాణలో గత 24 గంటల్లో 1,03,398 కరోనా పరీక్షలు నిర్వహించగా, 808 మందికి కరోనా నిర్ధారణ అయింది. అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 82 కొత్త కేసులు నమోదయ్యాయి. నల్గొండ జిల్లాలో 62, ఖమ్మం జిల్లాలో 59, కరీంనగర్ జిల్లాలో 58 కేసులు వెల్లడయ్యాయి. అత్యల్పంగా ఆదిలాబాద్ జిల్లాలో 2 కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో రాష్ట్రంలో 1,061 మంది కరోనా నుంచి కోలుకోగా, 7 మరణాలు సంభవించాయి. తాజా మరణాలతో కలిపి ఇప్పటివరకు 3,698 మంది కరోనాతో మృతి చెందారు.

రాష్ట్రంలో ఇప్పటిదాకా 6,27,498 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 6,12,096 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 11,704 మంది చికిత్స పొందుతున్నారు.


Telangana
COVID19
Update
Bulletin

More Telugu News