యూపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం.. యోగికి మోదీ అభినందనలు
- 67 జిల్లా పంచాయతీలను కైవసం చేసుకున్న బీజేపీ
- యోగి, పార్టీ కార్యకర్తల కృషి వల్లే సాధ్యమైందన్న మోదీ
- 2022 అసెంబ్లీ ఎన్నికల్లో తమదే విజయమన్న యూపీ బీజేపీ చీఫ్
రాష్ట్రంలోని 75 జిల్లా పంచాయతీలకు ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీజేపీ మద్దతుదారులు 67 జిల్లా పంచాయతీలను కైవసం చేసుకున్నారు. సీఎం యోగి, ప్రధాని మోదీ పాప్యులారిటీతోపాటు ప్రజా సంక్షేమ విధానాలే పార్టీకి విజయాన్ని కట్టబెట్టాయని పేర్కొన్న యూపీ బీజేపీ అధ్యక్షుడు స్వతంత్రదేవ్ సింగ్.. వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో విజయం తమదేనని ధీమా వ్యక్తం చేశారు.