శ్రీశైలం జలాశయానికి ఆగిపోయిన వరద
- రెండు రాష్ట్రాల్లో తగ్గుముఖం పట్టిన వర్షాలు
- ఔట్ ఫ్లో 21,189 క్యూసెక్కులు
- ఎడమగట్టులో కొనసాగుతున్న విద్యుదుత్పత్తి
తెలంగాణ పరిధిలో ఉన్న ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రంలో విద్యుదుత్పత్తి కొనసాగుతుండగా... ఏపీ పరిధిలోని కుడిగట్టులో మాత్రం విద్యుదుత్పత్తి ప్రారంభంకాలేదు. మరోవైపు నేటి నుంచి జలాశయం పైకి సందర్శకులను అనుమతించడం లేదు. రెండు రాష్ట్రాల మధ్య జల జగడం నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. జలాశయం వద్ద రెండు రాష్ట్రాల పోలీసులు మోహరించారు.