Vijay Devarakonda: అనుష్క సినిమాలో విజయ్ దేవరకొండ గెస్ట్ రోల్!

నాయిక ప్రధానమైన కథలకు అనుష్క ప్రాధాన్యతను ఇవ్వబట్టి చాలాకాలమే అయింది. 'భాగమతి' భారీ విజయాన్ని సొంతం చేసుకున్నా, 'నిశ్శబ్దం' మాత్రం నిరాశపరిచింది. తరువాత ఆమె నుంచి ఎలాంటి సినిమా రాలేదు .. ఫలానా చిత్రంలో పక్కాగా చేయనుందనే ప్రకటన కూడా రాలేదు. ఈ నేపథ్యంలోనే ఆమె ఒక విభిన్నమైన కథలో రొటీన్ కి భిన్నంగా ఉండే పాత్రను చేయడానికి అంగీకరించిందనే టాక్ వినిపించింది. ఈ సినిమాలో నవీన్ పోలిశెట్టి ప్రధానమైన పాత్రలో కనిపించనున్నాడు.

ఇక ఇప్పుడు విజయ్ దేవరకొండ పేరు తెరపైకి వచ్చింది. ఈ సినిమాలో ఆయన ఒక గెస్టురోల్ చేయనున్నట్టుగా ఒక వార్త షికారు చేస్తోంది. విజయ్ దేవరకొండ .. నవీన్ పోలిశెట్టి మంచి స్నేహితులు. సినిమా ఫీల్డ్ లోకి రావడానికి ముందు ఇద్దరు కలిసే ప్రయత్నాలు చేశారు .. ఇద్దరు కలిసి నటించారు. ఆ మధ్య నవీన్ పోలిశెట్టి సినిమా వేడుకలో విజయ్ ఒక రేంజ్ లో సందడి చేశాడు కూడా. అందువలన ఈ ప్రచారాన్ని కొట్టేయడానికి లేదు. త్వరలోనే ఈ విషయంలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ సినిమాకి, 'రా రా కృష్ణయ్య' ఫేమ్ మహేశ్ దర్శకుడిగా వ్యవహరించనున్నాడని అంటున్నారు.    
Vijay Devarakonda
Naveen Polishetty
Anushka Shetty

More Telugu News