సాయితేజ్ కి సవాల్ విసిరే పాత్రలో రమ్యకృష్ణ!
- ఐఏఎస్ పాత్రలో సాయితేజ్
- పొలిటికల్ లీడర్ గా రమ్యకృష్ణ
- సంగీత దర్శకుడిగా మణిశర్మ
- త్వరలోనే ప్రేక్షకుల ముందుకు
అంటే ఈ సినిమాలో సాయితేజ్ - రమ్యకృష్ణ మధ్య వార్ బలంగా నడుస్తుందని చెబుతున్నారు. అహంభావంతో కూడిన అధికారానికి .. బాధ్యతతో కూడిన అధికారానికి మధ్య జరిగే పోరాటం చుట్టూ ఈ కథ నడుస్తుందన్న మాట. సాయితేజ్ జోడీగా ఐశ్వర్య రాజేశ్ నటించగా, ముఖ్యమైన పాత్రలో జగపతిబాబు కనిపించనున్నాడు. మణిశర్మ సంగీతం ఈ సినిమాకి ప్రత్యేకమైన ఆకర్షణగా నిలవనుందని అంటున్నారు. మరి ఈ సినిమా థియేటర్స్ కి వస్తుందా? ఓటీటీకి వెళుతుందా? అనేది చూడాలి.