Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఏపీలో క్రమంగా తగ్గుతున్న కరోనా కేసులు.. పూర్తి అప్ డేట్స్!

AP registers 3841 new Corona cases
  • 24 గంటల్లో 3,841 మందికి కరోనా పాజిటివ్
  • ఇదే సమయంలో 38 మంది మృతి
  • రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 38,178
ఏపీలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పడుతోంది. గత 24 గంటల్లో 90,574 మందికి కోవిడ్ టెస్టులను నిర్వహించగా... 3,841 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 760 కేసులు నమోదు కాగా... కర్నూలు జిల్లాలో అత్యల్పంగా 45 కేసులు రిజిస్టర్ అయ్యాయి. ఇదే సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా 38 మంది కరోనా బారిన పడి మృతి చెందారు. మరోవైపు 3,963 మంది కరోనా నుంచి కోలుకున్నారు.

తాజా గణాంకాలతో కలిసి ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 18,93,354కి చేరుకున్నాయి. ఇప్పటి వరకు 18,42,432 మంది కోలుకున్నారు. 12,744 మంది మృతి చెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 38,178 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
Andhra Pradesh
Corona Virus
Updates

More Telugu News