రఘురామ వ్యవహారంలో ఏపీ హోంశాఖ కార్యదర్శి, డీజీపీలకు ఎన్ హెచ్చార్సీ సమన్లు
- సీఐడీ అరెస్ట్ పై ఎన్ హెచ్చార్సీకి రఘురామ ఫిర్యాదు
- థర్డ్ డిగ్రీ ప్రయోగించారని వెల్లడి
- రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్ హెచ్చార్సీ నోటీసులు
- నివేదిక పంపకపోవడంతో తాజాగా ఆగ్రహం
ఏపీ హోంశాఖ కార్యదర్శి, డీజీపీలకు తాజాగా కండిషనల్ సమన్లు జారీ చేసింది. నివేదిక పంపడంలో ఎందుకు జాప్యం ఏర్పడిందంటూ ఎన్ హెచ్చార్సీ అసహనం వ్యక్తం చేసింది. ఆగస్టు 9 లోపు నివేదిక ఇవ్వాలంటూ ఆదేశించింది. గడువులోగా నివేదిక అందించకపోతే, ఆగస్టు 16న వ్యక్తిగతంగా హాజరు కావాలని హోంశాఖ కార్యదర్శి, డీజీపీలకు స్పష్టం చేసింది.