శ్రీశైలం జలాశయంలో పెరుగుతున్న నీటిమట్టం
- జలాశయానికి 36,207 క్యూసెక్కుల ఇన్ ఫ్లో
- 822.70 అడుగులకు చేరుకున్న నీటి మట్టం
- ఎడమగట్టు జలాశయంలో కొనసాగుతున్న విద్యుదుత్పత్తి
శ్రీశైలం డ్యామ్ పూర్తి నీటి నిల్వ స్థాయి 215.8070 టీఎంసీలు కాగా... ప్రస్తుతం జలాశయంలో 42.8708 టీఎంసీల నీరు ఉంది. ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రంలో (తెలంగాణ) విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుండగా.. కుడిగట్టు (ఏపీ) విద్యుత్ కేంద్రాల్లో విద్యుదుత్పత్తి ప్రారంభం కాలేదు.