ముంబయి పిల్లల్లో 50 శాతం మందికి కరోనా యాంటీబాడీలు: తాజా సర్వేలో వెల్లడి
- మూడో వేవ్ ముప్పు ఆందోళనల నుంచి ఉపశమనం
- సీరో సర్వేలో 51.18 శాతం సీరోపాజిటివిటీ
- 6-18 ఏళ్ల వారిపై సర్వే
- 10-14 ఏళ్ల వయసు వారిలో అధిక సీరోపాజిటివిటీ
ముంబయిలో మొత్తం 24 వార్డుల్లో సర్వే చేశారు. ఆరు నుంచి 18 ఏళ్ల మధ్య వయసుగల పిల్లల్లో మొత్తం 10 వేల నమూనాలను సేకరించారు. ఈ వర్గంలో మొత్తం 51.18 శాతం సీరో పాజిటివిటీ ఉన్నట్లు గుర్తించారు. అత్యధికంగా 10-14 ఏళ్ల మధ్య వయసుగల వారిలో 53.43 శాతం సీరోపాజిటివిటీ ఉన్నట్లు కనుగొన్నారు. ఇక 1-4 ఏళ్ల వారిలో 51.04 శాతం, 5-9 ఏళ్ల వారిలో 47.33 శాతం, 10-14 ఏళ్ల వారిలో 53.43 శాతం, 15-18 ఏళ్ల వారిలో 51.39 శాతం సీరోపాజిటివిటీ ఉన్నట్లు బీఎంసీ ప్రకటించింది.
మార్చిలో నిర్వహించిన సర్వేతో పోలిస్తే ప్రస్తుతం పిల్లల్లో సీరోపాజిటివిటీ పెరిగినట్లు తెలిపింది. గతంలో నిర్వహించిన సర్వేలో 39.4 శాతం మందిలో సీరోపాజిటివిటీ ఉన్నట్లు గుర్తించారు.