తెలంగాణలో 97 శాతానికి పెరిగిన కరోనా రికవరీ రేటు
- గత 24 గంటల్లో 1,12,982 కరోనా పరీక్షలు
- 993 మందికి కరోనా పాజిటివ్
- జీహెచ్ఎంసీ పరిధిలో 124 మందికి కరోనా
- అత్యల్పంగా ఆదిలాబాద్ జిల్లాలో 2 కేసులు
- రాష్ట్రంలో 9 మంది మృతి
అదే సమయంలో 1,417 మంది కరోనా నుంచి కోలుకోగా, 9 మంది మృతి చెందారు. తాజా మరణాలతో కలిపి కరోనా మృతుల సంఖ్య 3,644కి పెరిగింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 6,21,606 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 6,04,093 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 13,869 మంది చికిత్స పొందుతున్నారు.
