మరో వివాదంలో ట్విట్టర్... కశ్మీర్ ను ప్రత్యేక దేశంగా చూపుతూ మ్యాప్!
- కేంద్రం, ట్విట్టర్ మధ్య క్షీణించిన సంబంధాలు
- కొత్త ఐటీ చట్టంపై ట్విట్టర్ విముఖత!
- ఆగ్రహంతో ఉన్న కేంద్రం
- తాజాగా భారత మ్యాప్ ను తప్పుగా చూపించిన ట్విట్టర్
తాజాగా కశ్మీర్ ను దేశంగా చూపిస్తూ రూపొందించిన మ్యాప్ ను ట్విట్టర్ లోని ట్వీప్ లైఫ్ విభాగంలో పొందుపరిచారు. దీన్ని ఓ నెటిజన్ గుర్తించడంతో ఈ తప్పిదం వెలుగులోకి వచ్చింది. ఈ అంశంపై నెటిజన్లు ట్విట్టర్ ను ఏకిపారేస్తున్నారు. దీనిపై కేంద్రం తీవ్రస్థాయిలో స్పందించే అవకాశాలున్నాయి.