శ్రీశైలం జలాశయానికి భారీ వరద!

High Flood for Srisailam Resorvoir
  • ఎగువన కురుస్తున్న వర్షాలు
  • 44,554 క్యూసెక్కుల నీరు
  • ఇంకా ప్రారంభం కాని ఔట్ ఫ్లో
  • 41 టీఎంసీలకు పైగా నీటి నిల్వ
ప్రస్తుత వర్షాకాల సీజన్ లో తొలిసారిగా కృష్ణమ్మ జలకళను సంతరించుకుంది. ఎగువన కురుస్తున్న వర్షాలతో జూరాల ఇప్పటికే పూర్తిగా నిండిపోగా, కర్నూలు జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలకు శ్రీశైలానికి నీరు చేరుతోంది. ప్రస్తుతం జలాశయానికి 44,554 క్యూసెక్కుల నీరు వస్తోంది. ఔట్ ఫ్లో ఇంకా ప్రారంభం కాలేదు. జలాశయానికి అనుబంధంగా ఉన్న రెండు విద్యుత్ కేంద్రాల్లోనూ విద్యుత్ ఉత్పత్తి ప్రస్తుతానికి నిలిచే ఉంది. ఇక, ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం 821.30 అడుగులకు నీరు చేరుకుంది. రిజర్వాయర్ లో 41 టీఎంసీలకు పైగా నీరు నిల్వ ఉంది.
Go Back to Shorts
Srisailam
Flood
Water

More Telugu News