రూ.100 కోసం యూనివర్సిటీ మాజీ వీసీ హత్య!
- ఒడిశాలో ఘటన
- సంబల్ పూర్ వర్సిటీ మాజీ వీసీ దారుణహత్య
- నివాసంలోకి చొరబడిన దుండగుడు
- డబ్బు కోసం డిమాండ్
- నిరాకరించిన మాజీ వీసీ
- గొడ్డలితో దాడి చేసిన దుండగుడు
ఈ కేసులో నిందితుడిగా భావిస్తున్న 20 ఏళ్ల ప్రబిణ్ ధరువాను సమీపంలోని అటవీప్రాంతంలో ఉండగా అరెస్ట్ చేశారు. పోలీసులు అతడిని విచారిస్తున్నారు.
కాగా, మాజీ వీసీ ధ్రుబరాజ్ నాయక్ పర్యావరణవేత్తగానూ ప్రసిద్ధికెక్కారు. తాను నివాసం ఉంటున్న గ్రామంలోనే ఆయన మొక్కలు నాటి అటవీ ప్రాంతాన్ని అభివృద్ధి చేశారు. ఈ క్రమంలో చెట్లు నరికిన కొందరు గ్రామస్తులతో తగాదాలు, ఓ చెరువు విషయంలో వివాదం కూడా ఈ హత్యకు కారణమై ఉండొచ్చన్న కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నట్టు జిల్లా ఎస్పీ బికాస్ చంద్ర దాస్ వెల్లడించారు.