తెలంగాణలో వెయ్యికి దిగువగా రోజువారీ కరోనా కేసులు

Telangana corona cases declines below thousand
  • తెలంగాణలో బాగా నెమ్మదించిన కరోనా
  • గత 24 గంటల్లో 748 కేసులు
  • జీహెచ్ఎంసీ పరిధిలో 121 కేసులు
  • మూడు జిల్లాల్లో కొత్త కేసులు నిల్
  • రాష్ట్రంలో 8 మంది మృతి
తెలంగాణలో కరోనా వ్యాప్తి బాగా అదుపులోకి వచ్చింది. గత కొన్నినెలల కాలంలో ఎన్నడూ లేనంతగా, వెయ్యికి లోపే రోజువారీ కేసులు వెల్లడయ్యాయి. గడచిన 24 గంటల్లో 81,405 కరోనా పరీక్షలు నిర్వహించగా, 748 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 121 మందికి కరోనా సోకినట్టు నిర్ధారణ అయింది. కొమరంభీం ఆసిఫాబాద్, కామారెడ్డి, ఆదిలాబాద్ జిల్లాల్లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు.

అదే సమయంలో 1,492 మంది కరోనా నుంచి కోలుకోగా, 8 మంది మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 6,20,613 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 6,02,676 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 14,302 మంది చికిత్స పొందుతున్నారు. ఇప్పటిదాకా కరోనాతో మొత్తం 3,635 మంది మరణించారు. తెలంగాణలో కరోనా రికవరీ రేటు 97.10 శాతానికి పెరిగింది.
Go Back to Shorts
Telangana
Corona Virus
New Cases
Deaths

More Telugu News