రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పర్యటన సందర్భంగా ట్రాఫిక్ నిలిపివేత.. మహిళా పారిశ్రామికవేత్త మృతి
- యూపీలోని కాన్పూరులో ఘటన
- ట్రాఫిక్ జామ్‌లో గంటపాటు చిక్కుకుపోయిన వందన మిశ్రా
- పోలీసులను వేడుకున్నా కనికరించని వైనం
- విచారం వ్యక్తం చేసిన రాష్ట్రపతి.. క్షమాపణ చెప్పిన పోలీసు కమిషనర్
తన భార్య ప్రాణాపాయ స్థితిలో ఉందని, విడిచిపెట్టాలని వేడుకున్నప్పటికీ పోలీసులు పట్టించుకోలేదని శరద్ మిశ్రా కన్నీళ్లు పెట్టుకున్నారు. సకాలంలో ఆసుపత్రికి తెచ్చి ఉంటే బతికేదని వైద్యులు చెప్పారని ఆవేదన వ్యక్తం చేశారు. విషయం తెలిసిన రాష్ట్రపతి విచారం వ్యక్తం చేశారు. కాన్పూరు పోలీస్ కమిషనర్ అసీం అరుణ్ ఈ ఘటనపై క్షమాపణలు తెలిపారు. ఓ ఎస్సై, ముగ్గురు హెడ్ కానిస్టేబుళ్లను సస్పెండ్ చేశారు. కాగా, వందన అంత్యక్రియలకు పోలీస్ కమిషనర్ అసీం అరుణ్, కలెక్టర్ హాజరయ్యారు. బాధిత కుటుంబానికి రాష్ట్రపతి సందేశాన్ని తెలియపరిచారు.