అది బీజేపీ ఆఫీసులో బీజేపీ నేతలు తయారుచేసిన నివేదిక: ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి విమర్శలు
- అసలు ఆడిట్ రిపోర్టే లేదన్న మనీశ్ సిసోడియా
- ఆడిట్ కమిటీతో మాట్లాడామని కామెంట్
- కమిటీ ఏ నివేదికా ఇవ్వలేదని వెల్లడి
ఏ నివేదికపైనా ఆక్సిజన్ ఆడిట్ కమిటీ సంతకం చేయలేదని, అలాంటప్పుడు ఈ నివేదిక ఎక్కడి నుంచి వచ్చిందని ఆయన ప్రశ్నించారు. తాము ఆక్సిజన్ ఆడిట్ కమిటీ సభ్యులతో మాట్లాడామన్నారు. ఆడిట్ కమిటీ నివేదిక ఇవ్వలేదని, ఈ నివేదిక బూటకమని అన్నారు. బీజేపీ ప్రధాన కార్యాలయంలో బీజేపీ నేతలు తయారు చేసిన నివేదికదని విమర్శించారు. దమ్ముంటే ఆడిట్ కమిటీ సంతకం చేసిన నివేదికను బయట పెట్టాలని సవాల్ విసిరారు.