navneet kaur: తెలుగు ప్ర‌జ‌ల వ‌ల్లే నాకు పేరు వ‌చ్చింది: తిరుమ‌ల‌లో మ‌హారాష్ట్ర ఎంపీ న‌వ‌నీత్ కౌర్

navneet kaur vistis tirumala
షార్ట్స్‌లో చూడండి
తెలుగు ప్ర‌జ‌ల వ‌ల్లే త‌న‌కు పేరు వ‌చ్చిందని సినీన‌టి, మ‌హారాష్ట్ర‌లోని అమ‌రావ‌తి ఎంపీ న‌వ‌నీత్ కౌర్ తెలిపారు. న‌వ‌నీత్ కౌర్ గత లోక్ సభ ఎన్నికల సమయంలో తప్పుడు కుల ధ్రువీకరణ పత్రం సమర్పించారన్న ఆరోపణలపై ఇటీవల విచారణ జరిపిన బాంబే హైకోర్టు.. ఆమె ఎస్సీ కాదని తీర్పు ఇవ్వడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించిన విష‌యం తెలిసిందే. దీంతో బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధించింది.

ఈ నేప‌థ్యంలో న‌వ‌నీత్ కౌర్ ఈ రోజు తిరుమ‌ల శ్రీ‌వారిని ద‌ర్శించుకుని మీడియాతో మాట్లాడారు. కుల ధ్రువీక‌ర‌ణ ప‌త్రం అంశంపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చింద‌ని చెప్పారు. అందుకే తాను ఈ రోజు శ్రీ‌వారిని ద‌ర్శించుకున్నాన‌ని తెలిపారు. తాను తెలుగు ప్ర‌జ‌ల‌కు సేవ చేయాల‌ని అనుకుంటున్న‌ట్లు చెప్పారు. రైతులు, మ‌హిళ‌లు, యువ‌త‌కు సాయం చేస్తాన‌ని అన్నారు. దేశంలో కొవిడ్ విజృంభ‌ణ త‌గ్గి ప్ర‌జ‌లంద‌రూ సంతోషంగా ఉండాల‌ని శ్రీ‌వారిని మొక్కుకున్న‌ట్లు తెలిపారు.
Go Back to Shorts
navneet kaur
TTD
Tirumala

More Telugu News