హుజూరాబాద్ ఉప ఎన్నిక కేసీఆర్ అహంకారానికి, తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి మధ్య పోరు: ఈటల
- హుజూరాబాద్‌లో విలేకరులతో మాట్లాడిన ఈటల
- మంత్రులు, ఎమ్మెల్యేలు మాయమాటలు చెబుతున్నారన్న రాజేందర్
- ఈటల లేకుంటే తెలంగాణ ఉద్యమం ఎక్కడన్న జితేందర్‌రెడ్డి
కేసీఆర్ అహంకారానికి, తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి మధ్య జరుగుతున్నదే హుజూరాబాద్ ఉప ఎన్నిక అని అభివర్ణించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు మాయమాటలు చెబుతున్నారని మండిపడ్డారు. పింఛన్లు, రేషన్ కార్డులు ఇస్తామని, గ్రామానికి రూ. 50 లక్షలు, కోటి రూపాయలు ఇస్తామని ప్రజలను మభ్య పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈటల లేకపోతే తెలంగాణ ఉద్యమమే లేదని మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి అన్నారు. ప్రజాస్వామ్య పాలన కావాలో, గడీల పాలన కావాలో ప్రజలు తేల్చుకోవాలని ఎమ్మెల్యే రఘునందన్‌రావు ప్రజలకు సూచించారు.