తెలంగాణలో మరింత తగ్గిన రోజువారీ కరోనా కేసులు

Telangana daily corona cases update
  • గత 24 గంటల్లో 1,19,466 కరోనా పరీక్షలు
  • జీహెచ్ఎంసీ పరిధిలో 137 కేసులు
  • రాష్ట్రంలో 9 మంది మృతి
  • అదే సమయంలో 1,511 మందికి కరోనా నయం
తెలంగాణలో కరోనా తీవ్రత బాగా తగ్గింది. గడచిన 24 గంటల్లో 1,19,466 కరోనా పరీక్షలు నిర్వహించగా 1,088 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 137 మందికి కరోనా సోకినట్టు నిర్ధారణ కాగా, అత్యల్పంగా ఆదిలాబాద్, కామారెడ్డి జిల్లాల్లో 2 చొప్పున కొత్త కేసులు వెల్లడయ్యాయి. అదే సమయంలో 1,511 మంది కరోనా నుంచి కోలుకుని ఆరోగ్యవంతులు కాగా, 9 మంది మరణించారు.

రాష్ట్రంలో ఇప్పటివరకు 6,17,776 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 5,98,139 మంది కరోనా నుంచి విముక్తులయ్యారు. ఇంకా 16,030 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 3,607కి చేరింది.
Go Back to Shorts
Telangana
Corona Virus
Daily Cases
Deaths

More Telugu News