కేసీఆర్ పై మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించిన ఈటల రాజేందర్
- అధికారం కోసం కేసీఆర్ ఎంతకైనా తెగిస్తారు
- డబ్బులు, కుట్రలను నమ్ముకుని ఎన్నికలకు వస్తారు
- హుజూరాబాద్ ప్రజల ముందు ఆయన డబ్బులు పని చేయవు
ఒడ్డు ఎక్కేదాక ఓడ మల్లన్న.. ఒడ్డు ఎక్కిన తర్వాత బోడ మల్లన్న తరహాలో కేసీఆర్ వ్యవహరిస్తున్నారని విమర్శించారు. అధికారం కోసం కేసీఆర్ ఎంతకైనా తెగిస్తారని దుయ్యబట్టారు. డబ్బులు, కుట్రలను నమ్ముకుని ఆయన ఎన్నికలకు వస్తారని ఆరోపించారు. అయితే హుజారాబాద్ ప్రజల ముందు కేసీఆర్ డబ్బులు, కుట్రలు పని చేయవని అన్నారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని హుజూరాబాద్ ప్రజలు అమ్ముకోరని చెప్పారు.