తెలంగాణలో కొత్తగా 1,175 కరోనా పాజిటివ్ కేసులు
Add ap7am to your home Screen

తెలంగాణలో కొత్తగా 1,175 కరోనా పాజిటివ్ కేసులు

Telangana covid cases update
  • గత 24 గంటల్లో 1,24,907 కరోనా పరీక్షలు
  • జీహెచ్ఎంసీ పరిధిలో 133 కేసులు
  • ఆసిఫాబాద్ జిల్లాలో 3 కేసులు
  • రాష్ట్రంలో 10 మంది మృతి
తెలంగాణలో గడచిన 24 గంటల్లో 1,24,907 కరోనా పరీక్షలు నిర్వహించగా 1,175 మందికి కరోనా పాజిటివ్ గా వెల్లడైంది. జీహెచ్ఎంసీ పరిధిలో 133 కొత్త కేసులు నమోదు కాగా, ఖమ్మం జిల్లాలో 76 కేసులు గుర్తించారు. అత్యల్పంగా కొమరంభీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో 3 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో రాష్ట్రంలో 1,771 మంది కరోనా నుంచి కోలుకోగా, 10 మంది మృతి చెందారు. తాజా మరణాలతో కలిపి కరోనా మృతుల సంఖ్య 3,586కి పెరిగింది.

ఇక, రాష్ట్రంలో ఇప్పటివరకు 6,15,574 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 5,95,348 మంది కరోనా నుంచి విముక్తులయ్యారు. ఇంకా 16,640 మంది చికిత్స పొందుతున్నారు. తెలంగాణలో కరోనా కేసుల రికవరీ రేటు ప్రస్తుతం 96.71 శాతంగా ఉంది.
Telangana
Corona Virus
New Cases
Deaths
Recovery Rate

More Telugu News