ఆదిసాయికుమార్ కొత్త చిత్రం టైటిల్ ఖరారు!
- వీరభద్రం నుంచి క్రైమ్ థ్రిల్లర్
- 'కిరాతక' టైటిల్ ఫిక్స్
- కథానాయికగా పాయల్
- త్వరలోనే రెగ్యులర్ షూటింగ్
ఆదిసాయికుమార్ కి కొంతకాలంగా సరైన హిట్ పడలేదు. అలాంటి హిట్ కోసమే ఆయన ఎదురుచూస్తున్నాడు. ఇటీవల వచ్చిన 'శశి' పై ఆయన ఆశలు పెట్టుకున్నాడుగానీ, ఆ సినిమా థియేయటర్ల దగ్గర నిలబడలేక పోయింది. దాంతో ఆయన తాజా చిత్రంపైనే గట్టినమ్మకంతో ఉన్నాడు. దర్శకుడు వీరభద్రం కూడా సరైన హిట్ కోసమే ఎదురుచూస్తున్నాడు. ఈ సారి తప్పకుండా హిట్ కొట్టాలనే పట్టుదలతో ఉన్నాడు. ఇక కొంతకాలంగా మంచి అవకాశం కోసం వెయిట్ చేస్తున్న పాయల్, ఈ సినిమా తన కెరియర్ కి హెల్ప్ అవుతుందని భావిస్తోంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ ముగ్గురికీ ఈ సినిమా హిట్ చాలా అవసరమే!