బీచ్ రోడ్ కారిడార్ కార్పొరేషన్... విశాఖ తీరప్రాంత అభివృద్ధికి కొత్త సంస్థ
- విశాఖ-భీమిలి-భోగాపురం బీచ్ రోడ్ అభివృద్ధికి ప్రణాళిక
- రిసార్టులు, గోల్ఫ్ కోర్టులు నిర్మాణం
- 570 ఎకరాల్లో అభివృద్ధి
- అంచనా వ్యయం రూ.1,021 కోట్లు
ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.1,021 కోట్లు. విశాఖ-భీమిలి-భోగాపురం బీచ్ రోడ్ లో 570 ఎకరాల్లో ఈ కారిడార్ ఏర్పాటు చేస్తారు. విశాఖ తీరప్రాంత టూరిజం, వాణిజ్య, మౌలిక సదుపాయాల కల్పన ఈ బీచ్ రోడ్ కారిడార్ కార్పొరేషన్ ప్రధాన విధి.
కాగా, విశాఖపట్నం నగరానికి అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన, అభివృద్ధికి రూ.5,174 కోట్లతో ప్రతిపాదనలు రూపొందించినట్టు కొన్నిరోజుల కిందట వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి వెల్లడించారు.