మా క్షేమం గురించి ఆరా తీసిన గవర్నర్ మేడమ్ కు కృతజ్ఞతలు: మంత్రి హరీశ్ రావు
- గతరాత్రి హరీశ్ రావుకు తప్పిన ప్రమాదం
- సిద్ధిపేట నుంచి హైదరాబాద్ వస్తుండగా ఘటన
- కాన్వాయ్ కు అడ్డొచ్చిన అడవిపంది
- కాన్వాయ్ లో పరస్పరం ఢీకొన్న వాహనాలు
- దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన గవర్నర్ తమిళిసై
దీనిపై మంత్రి హరీశ్ రావు స్పందిస్తూ, తమ గురించి ఆరా తీసిన గవర్నర్ మేడమ్ కు కృతజ్ఞతలు అంటూ ట్వీట్ చేశారు. తమ క్షేమం పట్ల ఆమె ఎంతో ఆందోళన కనబర్చారని, అయితే, ఈ ఘటనలో తనకు గానీ, తన కాన్వాయ్ లో ఎవరికీ గానీ ఎలాంటి ప్రమాదం జరగలేదని హరీశ్ రావు వెల్లడించారు. అందరం క్షేమంగా ఉన్నామని తెలిపారు.