బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిలో జీహెచ్ఎంసీ మేయర్ పుట్టినరోజు వేడుకలు.. శుభాకాంక్షలు తెలిపిన బాలయ్య
- నేడు జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి జన్మదినం
- బసవతారకం ఆసుపత్రి సందర్శన
- క్యాన్సర్ రోగుల మధ్య వేడుకలు
- కృతజ్ఞతలు తెలిపిన బాలకృష్ణ
యోగా ముఖ్య ఉద్దేశం ఇదే: బాలకృష్ణ
ఇవాళ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాదులోని బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్ లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. యాడ్ లైఫ్ జిమ్ చేపట్టిన ఈ కార్యక్రమానికి బసవతారకం ఆసుపత్రి మేనేజింగ్ ట్రస్టీ నందమూరి బాలకృష్ణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, యోగాతో మనిషి శక్తిసామర్థ్యాలు ఇనుమడిస్తాయని తెలిపారు. దేహం, మనసు మధ్య సమతుల్యం సాధ్యపడుతుందని అన్నారు. అసలు.... యోగా ముఖ్య ఉద్దేశమే శరీరం, మనసు, బాహ్య పరిస్థితుల నడుమ సామరస్యం పెంపొందించడం అని బాలయ్య భాష్యం చెప్పారు.
ఈ కార్యక్రమానికి డాక్టర్ ఉదయ్, భరద్వాజ్ అనే యోగా నిపుణులు హాజరై, కార్యక్రమానికి వచ్చిన వారితో యోగాసనాలు వేయించారని వెల్లడించారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన యాడ్ లైఫ్ బృందానికి అభినందనలు తెలుపుతున్నట్టు వివరించారు.