తెలుగు రాష్ట్రాల పర్యటనల్లో భావోద్వేగాలకు గురయ్యా: జస్టిస్ ఎన్వీ రమణ
- తెలుగు రాష్ట్రాల్లో సీజేఐ పర్యటన
- ముగింపు సందర్భంగా ఎన్వీ రమణ ఆసక్తికర వ్యాఖ్యలు
- పర్యటన సంతృప్తి కలిగించిందని వెల్లడి
- తెలుగు ప్రజలకు శతకోటి వందనాలు తెలిపిన వైనం
తెలుగు రాష్ట్రాల్లో పర్యటన తనను భావోద్వేగాలకు గురిచేసిందని ఎన్వీ రమణ చెప్పారు. తెలుగు ప్రజల దీవెనలతో సీజేఐ బాధ్యతలు సమర్థంగా నిర్వర్తిస్తానని ఉద్ఘాటించారు. తెలంగాణ రాజ్ భవన్, హైకోర్టు, పోలీసులకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నట్టు పేర్కొన్నారు. తిరుమల, యాదాద్రి, శ్రీశైలం పాలకమండళ్లకు కృతజ్ఞతలు తెలిపారు.