తాడేపల్లిలో సీఎం జగన్ నివాసం వద్ద హై అలర్ట్ ప్రకటించిన పోలీసులు
- అమరావతి రైతుల దీక్షలకు రేపటితో 550 రోజులు
- సీఎం కార్యాలయం ముట్టడిస్తారన్న సమాచారం
- అప్రమత్తమైన పోలీసులు
- భారీగా బందోబస్తు ఏర్పాటు
సీఎం నివాసం పరిధిలో ఎవరైనా కొత్తవారికి ఆశ్రయం కల్పిస్తే చర్యలు తప్పవని పోలీసులు స్పష్టం చేశారు. సీఎం క్యాంపు కార్యాలయానికి దారితీసే మార్గాల్లో పెద్ద ఎత్తున బలగాలను మోహరించారు. ఏపీకి మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నప్పటి నుంచి అమరావతి రైతులు ధర్నాలు చేపడుతున్న సంగతి తెలిసిందే. కరోనా సమయంలోనూ రైతుల దీక్షలు కొనసాగాయి.