సోనియా, రాహుల్ తో తమిళనాడు సీఎం సమావేశం
- ఆమె నివాసానికి వెళ్లి కలిసిన స్టాలిన్
- అధికారంలోకి వచ్చాక తొలిసారి భేటీ
- తమిళనాడు బాగు కోసం డీఎంకేతో కలిసి పనిచేస్తామన్న రాహుల్
స్టాలిన్, ఆయన భార్య దుర్గావతి స్టాలిన్ తో సమావేశమవడం పట్ల రాహుల్ గాంధీ హర్షం వ్యక్తం చేశారు. తమిళ ప్రజల కోసం మెరుగైన పాలన అందించేందుకు, తమిళనాడు అభివృద్ధికి డీఎంకేతో కలిసి ఎప్పుడూ పనిచేస్తూనే ఉంటామని ఆయన ట్వీట్ చేశారు. కాగా, గురువారం ఆయన ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమైన సంగతి తెలిసిందే. ఆ సమావేశంలో భాగంగా సీఏఏ, సాగు చట్టాలు, నీట్ ను రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అంతేగాకుండా టీకాల సరఫరా, జీఎస్టీ పరిహారం చెల్లింపు, శ్రీలంక తమిళులకు హక్కులు వంటి విషయాలపైనా చర్చించారు.