తెలంగాణలో కొత్తగా 1,492 కరోనా కేసులు, 13 మరణాలు
- తెలంగాణలో మరింత తగ్గిన కరోనా వ్యాప్తి
- గత 24 గంటల్లో 1,19,464 కరోనా టెస్టులు
- జీహెచ్ఎంసీ పరిధిలో 166 కేసులు
- ఆసిఫాబాద్ జిల్లాలో ఒక కేసు నమోదు
అదే సమయంలో రాష్ట్రంలో 1,933 మంది కరోనా నుంచి కోలుకోగా, 13 మంది మరణించారు. తాజా మరణాలతో కలిపి తెలంగాణలో ఇప్పటివరకు 3,534 మంది కరోనాతో కన్నుమూశారు. రాష్ట్రంలో ఇప్పటిదాకా 6,09,417 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 5,86,362 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 19,521 మందికి చికిత్స జరుగుతోంది.