కశ్మీర్ సరిహద్దుల్లో జవాన్లతో ఉల్లాసంగా గడిపిన హీరో అక్షయ్ కుమార్
- తులైల్ క్యాంపును సందర్శించిన అక్షయ్
- బీఎస్ఎఫ్ జవాన్లతో ఆటాపాట
- ముగ్ధుడ్నయ్యానన్న అక్షయ్
- జవాన్లే రియల్ హీరోలని కితాబు
సరిహద్దులను రక్షిస్తున్న ధైర్యశాలులను కలిశానని, తన పర్యటన గుర్తుంచుకోదగ్గ విధంగా సాగిందని వెల్లడించారు. దేశ సరిహద్దులకు రావడం ఎల్లప్పుడూ ముగ్ధుడ్ని చేస్తుందని, నిజమైన హీరోలను కలవడం సంతోషాన్నిస్తుందని తెలిపారు. తన హృదయం పూర్తిగా జవాన్ల పట్ల గౌరవంతో నిండిపోయిందని అక్షయ్ కుమార్ పేర్కొన్నారు. తన పర్యటనకు సంబంధించిన ఫొటోలను కూడా పంచుకున్నారు.

