హెచ్సీఏ ఎన్నికల్లో కవిత పోటీ అంటూ వస్తున్న వార్తలపై అజారుద్దీన్ స్పందన
- కవిత వ్యాఖ్యలు నా దృష్టికి రాలేదు
- అసోసియేషన్ ఎన్నికల్లో ఎవరైనా పోటీ చేయొచ్చు
- హైదరాబాద్ క్రికెట్ ను అభివృద్ధి చేయడమే నా లక్ష్యం
మరోవైపు, హెచ్సీఏ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పోటీ చేయబోతున్నారనే ప్రచారం జరుగుతోంది. హెచ్సీఏ గాడి తప్పిందంటూ కవిత చేసిన వ్యాఖ్యలు కూడా ఈ ప్రచారానికి బలం చేకూర్చాయి. ఈ అంశంపై అజార్ మాట్లాడుతూ, కవిత వ్యాఖ్యలు తన దృష్టికి రాలేదని చెప్పారు. అసోసియేషన్ ఎన్నికల్లో ఎవరైనా పోటీ చేయవచ్చని, అందులో తప్పేం లేదని అన్నారు. హైదరాబాద్ క్రికెట్ ను అభివృద్ధి చేయడమే తన లక్ష్యమని చెప్పారు.