హుజూరాబాద్ కు రూ.35 కోట్లు మంజూరు చేసిన తెలంగాణ ప్రభుత్వం
టీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పిన మాజీ మంత్రి ఈటల నియోజకవర్గంపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో దృష్టి సారించింది. హుజూరాబాద్ పట్టణాభివృద్ధికి రూ. 35 కోట్లను కేటాయిస్తూ జీవో విడుదల చేసింది. ఇందులో వార్డుల అభివృద్ధి కోసం రూ. 25 కోట్లు, తాగునీటి కోసం రూ. 10.52 కోట్లను కేటాయించింది. ఈ విషయాన్ని మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. ఈ పనులన్నింటినీ 45 రోజుల్లో పూర్తి చేస్తామని చెప్పారు. ఈ పనులను చేయడానికి ప్రత్యేక అధికారులను నియమిస్తామని మంత్రి తెలిపారు.