ఈ-పాస్ లేకుండా ఏపీ నుంచి వస్తున్న వాహనాలను నిలిపివేస్తున్న తెలంగాణ పోలీసులు
- ఆదివారం మరింత పెరిగిన ట్రాఫిక్
- రామాపురం చెక్ పోస్టు వద్ద భారీగా వాహనాల నిలిపివేత
- ఈ-పాస్ ఉంటేనే తెలంగాణలోకి అనుమతి
- ఈ-పాస్ ఉండాల్సిందేనన్న తెలంగాణ పోలీసులు
దీనిపై కోదాడ ఎస్ఐ సైదులు స్పందిస్తూ, ప్రజలు తెలంగాణ పోలీసులకు సహకరించాలని, ప్రయాణాలు చేసేవారు ఈ-పాస్ లతో రావాలని స్పష్టం చేశారు. కాగా, రామాపురం చెక్ పోస్టు వద్ద ఈ మధ్యాహ్నం భారీగా వాహనాలు నిలిచిపోయిన దృశ్యాలు కనిపించాయి. ఎంతసేపు వేచిచూసినా అనుమతించకపోవడంతో చాలామంది వాహనదారులు నిరాశగా వెనుదిరిగారు.