చోక్సీ బెయిలు పిటిషన్‌ను తిరస్కరించిన డొమినికా హైకోర్టు
- గత నెల 25న అంటిగ్వా నుంచి చోక్సీ పరార్
- అనారోగ్య కారణాలతో బెయిలు ఇవ్వాలన్న న్యాయవాదులు
- ఇవ్వలేమని తేల్చి చెప్పిన న్యాయస్థానం
చోక్సీ మరెక్కడికీ పారిపోరని, అనారోగ్య కారణాలతో బెయిలు మంజూరు చేయాలంటూ ఆయన తరపు న్యాయవాదులు కోర్టును కోరారు. అయితే, ‘ఫ్లైట్ రిస్క్’ (విచారణకు ముందే దేశం విడిచి వెళ్లిపోవడం) కారణంగా బెయిలు ఇచ్చేందుకు కోర్టు తిరస్కరించింది. డొమినికాలో చోక్సీ ఉంటున్నది స్థిరమైన చిరునామా కాదని, ఆయనపై నమోదైన ఆరోపణలపై ఇంకా విచారణ ప్రారంభం కాలేదని గుర్తు చేసింది.