తిరుమల కొండపై గదుల కేటాయింపులను మరింత సులభతరం చేసిన టీటీడీ
- 6 చోట్ల రిజిస్ట్రేషన్ కేంద్రాల ఏర్పాటు
- పేర్లు నమోదు చేసుకుంటే ఫోన్లకు సందేశం
- ఎస్ఎంఎస్ వస్తే నగదు చెల్లించి రూం పొందేలా ఏర్పాట్లు
- ఎల్లుండి రిజిస్ట్రేషన్ కేంద్రాల ప్రారంభం
ఈ కేంద్రాల వద్ద తమ పేర్లు నమోదు చేసుకున్న వారికి ఎస్ఎంఎస్ ద్వారా గదుల సమాచారం అందించనున్నారు. ఎస్ఎంఎస్ వచ్చిన వెంటనే నగదు చెల్లించి గది పొందేలా ఏర్పాట్లు చేశారు. టీటీడీ ఈ నెల 12న ఉదయం 8 గంటలకు ఈ రిజిస్ట్రేషన్ కేంద్రాలను ప్రారంభించనుంది.