జేసీ సోదరులకు వన్ ప్లస్ వన్ గన్‌మెన్ కేటాయింపు
- గతేడాది డిసెంబరులో తాడిపత్రి ఎమ్మెల్యేతో జేసీ సోదరులకు ఘర్షణ
- ప్రాణహాని ఉందని, గన్‌మెన్‌ను కేటాయించాలంటూ ప్రభుత్వానికి దరఖాస్తు
- తాజాగా ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వం
ఈ మేరకు తాడిపత్రి డీఎస్పీ వీఎన్‌కే చైతన్య తెలిపారు. తాడపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి, జేసీ సోదరులకు మధ్య గతేడాది డిసెంబరు 24న ఘర్షణలు జరిగాయి. ఈ నేపథ్యంలో తమకు ప్రాణభయం ఉందని, గన్‌మెన్లను కేటాయించాలంటూ జేసీ సోదరులు ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో స్పందించిన ప్రభుత్వం తాజాగా వీరికి వన్ ప్లస్ వన్ గన్‌మెన్లను కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.