ప్రభుత్వం దిగి వచ్చే వరకు పోరాడతాం!: నారా లోకేశ్
- పరీక్షలు రాయాలో, ప్రాణాలు కాపాడుకోవాలో విద్యార్థులకు తెలియడం లేదు
- 23,920 మంది 18 ఏళ్లలోపు పిల్లలు కరోనా బారినపడ్డారు
- వాట్సాప్ నంబరుకు 5 లక్షల మంది సంఘీభావం
రాష్ట్రంలో 23,920 మంది 18 ఏళ్లలోపు పిల్లలు కరోనా బారినపడినట్టు మీడియాలో వార్తలు వచ్చాయన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పరీక్షల నిర్వహణ సరికాదని, ఈ విషయంలో ప్రభుత్వం దిగి వచ్చే వరకు పోరాడతామని అన్నారు.
పరీక్షలను రద్దు చేయాలన్న డిమాండుతో తాము ఏర్పాటు చేసిన వాట్సాప్ నంబరుకు గత రెండు నెలల్లో 5,00,823 మంది సంఘీభావం తెలిపినట్టు లోకేశ్ పేర్కొన్నారు. అలాగే, 2,47,868 మంది విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఈ నంబరు ఫోనులో తమ అభిప్రాయాలను పంచుకున్నట్టు వివరించారు.