ఏపీలో తగ్గుతున్న కరోనా కేసులు, మరణాలు
- గత 24 గంటల్లో 7,796 కేసులు, 77 మరణాలు
- చిత్తూరు జిల్లాలో 12 మరణాల నమోదు
- పశ్చిమ గోదావరి జిల్లాలో 10 మంది మృతి
- 11,629కి చేరిన మొత్తం మృతుల సంఖ్య
అటు, కరోనా పాజిటివ్ కేసుల విషయంలోనూ ఊరట లభిస్తోంది. గత 24 గంటల్లో రాష్ట్రంలో 89,732 కరోనా పరీక్షలు నిర్వహించగా... 7,796 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. తూర్పు గోదావరి జిల్లాలో 1,302 కేసులు, చిత్తూరు జిల్లాలో 1,210 కేసులు నమోదయ్యాయి. అత్యల్పంగా కర్నూలు జిల్లాలో 147 కొత్త కేసులు వెల్లడయ్యాయి. అదే సమయంలో 14,641 మంది కోలుకున్నారు.
రాష్ట్రంలో ఇప్పటిదాకా 17,71,007 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 16,51,790 మంది కోలుకుని ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 1,07,588 మందికి చికిత్స కొనసాగుతోంది.