నేను కసక్ అంటే మీరందరూ 'ఫసక్' అవుతారు అంటోన్న మోహన్ బాబు.. 'సన్నాఫ్ ఇండియా' టీజర్ విడుదల
- మోహన్ బాబు ప్రధాన పాత్రలో 'సన్నాఫ్ ఇండియా' చిత్రం
- టీజర్ హీరో సూర్య చేతుల మీదుగా విడుదల
- వాయిస్ ఓవర్ ఇచ్చిన చిరంజీవి
- మోహన్ బాబు 'రూటే సెపరేటు' అంటోన్న మెగాస్టార్
'నేను చీకటిలో ఉండే వెలుతురిని, వెలుతురులో ఉండే చీకటిని' అంటూ మోహన్ బాబు ఇందులో తనదైన శైలిలో డైలాగు చెప్పారు. 'నేను కసక్ అంటే మీరందరూ ఫసక్' అవుతారంటూ ఆయన చివర్లో మరో డైలాగు వదిలారు. మోహన్ బాబు అనేక రకాల లుక్‌లలో కనపడుతున్నారు. కాగా, ఈ సినిమాకు డైమండ్ రత్నబాబు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకి మంచు విష్ణు నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు.