స్పీడ్ పెంచడం కోసమే పవన్ ఆ నిర్ణయం తీసుకున్నాడట!
- 'వకీల్ సాబ్'తో రీ ఎంట్రీ
- సెట్స్ పై రెండు భారీ సినిమాలు
- హరీశ్ శంకర్ తో మరో మూవీ
ఇకపై తాను వరుస సినిమాలు చేయాలనే నిర్ణయాన్ని తన రీ ఎంట్రీ నుంచి పవన్ తీసుకున్నారు. క్రిష్ .. సాగర్ కె చంద్ర .. హరీశ్ శంకర్ లకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ వెళ్లారు. ఈ ముగ్గురు దర్శకులకు కూడా ఆయన 40 రోజులకు కాస్త ఆటు ఇటుగా డేట్స్ ఇచ్చారట. ఆ డేట్స్ లో తన పోర్షన్ షూటింగ్ పూర్తి కావాలి. అలాగే షూటింగ్ మొత్తం పూర్తి చేసుకుని 3 నెలల్లో సినిమా విడుదల కావాలి అనే ఒక విషయాన్ని దర్శక నిర్మాతలకు స్పష్టం చేసిన తరువాతనే రంగంలోకి దిగుతున్నారని అంటున్నారు. చకచకా సినిమాలు చేయడానికే పవన్ ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడన్న మాట.