సముద్రంలో మునిగిన ఇరాన్ యుద్ధ నౌక.. సిబ్బంది సేఫ్!
- ఇరాన్ నేవీకి చెందిన అతిపెద్ద యుద్ధ నౌక ‘ఖర్గ్’
- మునిగిపోవడానికి ముందు నౌకలో చెలరేగిన మంటలు
- ఇరాన్ ఓడరేవు జాస్క్ సమీపంలో ఘటన
తెల్లవారుజామున 2.25 గంటల సమయంలో నౌకలో మంటలు ఎగసిపడ్డాయని, దీంతో అప్రమత్తమైన అగ్నిమాపక సిబ్బంది వాటిని అదుపు చేసే ప్రయత్నం చేశారని ప్రభుత్వ టెలివిజన్ తెలిపింది. ఆ తర్వాత కాసేపటికే నౌక మునిగిపోయింది. ఒమన్ గల్ఫ్‌లోని టెహ్రాన్‌కు ఆగ్నేయంగా 790 మైళ్ల దూరంలో ఉన్న ఇరాన్ ఓడరేవు జాస్క్ సమీపంలో ఈ ఘటన జరిగినట్టు టీవీ పేర్కొంది.