1300 మంది డాక్టర్లు ప్రాణత్యాగం చేశారు... బాబా రాందేవ్ పై మరోసారి ధ్వజమెత్తిన ఐఎంఏ
- అల్లోపతి వైద్యంపై బాబా రాందేవ్ వ్యాఖ్యలు
- ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ఐఎంఏ
- బాబా రాందేవ్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్
- రాందేవ్ వ్యాఖ్యలు దేశద్రోహంగా పరిగణించాలంటూ లేఖ
ఆయన అనుచరులు ఐఎంఏపైనా, ఐఎంఏ అధ్యక్షుడిపైనా ద్వేషపూరిత దాడులకు పాల్పడుతున్న సంఘటనలు జరుగుతున్నాయని వివరించింది. రాందేవ్ పై కేంద్ర ప్రభుత్వం ఇప్పటికీ చర్యలు తీసుకోకపోవడం, కరోనాకు ఎదురునిలిచి పోరాడుతున్న డాక్టర్లను అవమానించడమేనని ఐఎంఏ పేర్కొంది. కరోనాతో పోరాటంలో 1300 మంది డాక్టర్లు ప్రాణత్యాగాలు చేశారని ఐఎంఏ వివరించింది. ఈ మేరకు కేంద్రానికి లేఖ రాసింది.