తెలంగాణలో 93 శాతానికి పెరిగిన కరోనా రికవరీ రేటు

Recovery rate increased in Telangana
  • గత 24 గంటల్లో 2,493 కొత్త కేసులు
  • 3,308 మందికి కరోనా నయం
  • 15 మంది మృతి
  • ఇంకా 33,254 మందికి చికిత్స
తెలంగాణలో కరోనా కొత్త కేసుల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పడుతోంది. గడచిన కొన్నిరోజులుగా 5 వేలకు లోపే రోజువారీ కేసులు నమోదవుతున్నాయి. గత 24 గంటల వ్యవధిలో 2,493 కొత్త కేసులు నమోదు కాగా, అదే సమయంలో 3,308 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో రికవరీ రేటు 93.70 శాతానికి పెరిగింది. జాతీయ స్థాయిలో రికవరీ రేటు 92.04గా నమోదైంది.

తాజా బులెటిన్ లో పేర్కొన్న వివరాలను పరిశీలిస్తే... రాష్ట్రంలో 94,189 కరోనా పరీక్షలు నిర్వహించారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 318 పాజిటివ్ కేసులు నమోదు కాగా, నల్గొండ జిల్లాలో 165, రంగారెడ్డి జిల్లాలో 152 కేసులు గుర్తించారు. గడచిన 24 గంటల్లో 15 మంది మరణించగా, మొత్తం మృతుల సంఖ్య 3,296కి పెరిగింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 5,80,844 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 5,44,294 మంది కోలుకున్నారు. ఇంకా 33,254 మందికి చికిత్స జరుగుతోంది.
Go Back to Shorts
Telangana
Recovery Rate
Corona
New Cases

More Telugu News