తెలంగాణలో కొత్తగా 2,524 కరోనా కేసులు, 18 మరణాలు
Add ap7am to your home Screen

తెలంగాణలో కొత్తగా 2,524 కరోనా కేసులు, 18 మరణాలు

Telangana corona update
  • గత 24 గంటల్లో 87,110 కరోనా పరీక్షలు
  • జీహెచ్ఎంసీ పరిధిలో 307 కొత్త కేసులు
  • అత్యల్పంగా ఆదిలాబాద్ జిల్లాలో 9 కేసులు
  • 3,464 మందికి కరోనా నయం
  • 93.53 శాతానికి పెరిగిన రికవరీ రేటు
తెలంగాణలో గత 24 గంటల్లో 87,110 కరోనా పరీక్షలు నిర్వహించగా 2,524 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 307 కొత్త కేసులు నమోదు కాగా, అత్యల్పంగా ఆదిలాబాద్ జిల్లాలో 9 కేసులు గుర్తించారు. అదే సమయంలో 3,464 మంది కరోనా నుంచి కోలుకోగా, 18 మంది మరణించారు. తెలంగాణలో ఇప్పటివరకు 5,78,351 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 5,40,986 మంది కోలుకున్నారు. ఇంకా 34,084 మంది చికిత్స పొందుతున్నారు. అటు, రాష్ట్రంలో రికవరీ రేటు 93.53 శాతానికి పెరిగింది.
Telangana
Corona Virus
New Cases
Deaths
Recovery Rate

More Telugu News